కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో భారీ చోరీ!..

దర్వాజ: దొంగలు దేవాలయాలను కూడా వదలడం లేదు భద్రత ఉన్న కూడ ఆలయంలో చొరబడి భారీ ఎత్తున వెండి సామాగ్రిని ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దొంగలు గర్భగుడి ఆలయంలో కి చొరబడి వెండి సా మాగ్రిని ఎత్తుకెళ్లిపోయారు. భద్రత సిబ్బంది ఉన్న పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయంలో దొంగలు ఎలా చొరపడ్డారని భక్తులు భద్రత సిబ్బందిపై మండిపడుతున్నారు. పోలీసులు ఆలయానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును ఆరా తీస్తున్నారు. దొంగతనం జరగడం వల్ల ఆలయ ద్వారాలు మూసివేసి భక్తులకు దర్శనం కల్పించలేదు విచారణ పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తామని పోలీసులు చెప్పారు…

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *