ప్రజల సొమ్ము దొబ్బడానికే…కౌన్సిల్ సమావేశం?

రామగుండం నగర పాలక కౌన్సిల్ సమావేశం ఈ నెల 31వ నిర్వహిస్తున్న తరణంలో నగర ప్రధమ పౌరుడు తమ అనుచర వర్గ కాంట్రాక్టర్ల తప్పుడు బిల్లులు కౌన్సిల్లో ఆమోదింప చేసుకొనికే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ నగర సహాయ కార్యదర్శి *మద్దెల దినేష్* ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతు నగర పాలక సంస్థలో కొంత మంది కాంట్రాక్టర్లు ముఖ్య ప్రజాప్రతినిధి అండతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చేయని పనులు చేసినట్లు తప్పుడు బిల్లులు, సృష్టిస్తూ కౌన్సిల్లో ఆమోదం చేసుకొని అభివృద్ధి చేయాల్సిన ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తు జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ ఇంధనం పేరుతో గతంలో ఉన్న సానిటరీ ఇన్స్పెక్టర్ అనేక కుంభకోణాలు చేసారని వాటిని బైటకి రానివ్వకుండా ముఖ్య ప్రజాప్రతినిధులు సానిటరీ అధికారికి అండగా నిలుస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటు పబ్బం గడుపుతున్నారన్నారు. ఇప్పుడు కూడా ఇదే ఇంధనం పేరుతో దాదాపు 90లక్షల బిల్లులను ఆమోదించడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదే విధంగా ఇది వరకు పనిచేసిన సానిటరీ అధికారి నామినేషన్ పనులలో నగర ప్రధమ పౌరుడి నేతృత్వంలో, మరియు వారి సహకరంతో జరిగిన పనులలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని దానికి సంబంధించిన పనులు, బిల్లులు దాదాపు 28లక్షల రూపాయలు బిల్లులు అప్రూవల్ చేసుకుని తమ జేబులో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రాహం వ్యక్తం చేశారు. ఇక మెడికల్ కళశాలకు సంబందించిన నిర్మాణ పనులు విషయానికి వస్తే మున్సిపల్ కార్పోరేషన్ చెట్ల పొదళ్ళు, చేశాం అని 9లక్షల 28 వేళా రూపాయలను బ్లెడ్ ట్రాక్టర్ల, జేసీబీలు, ఆపరేటర్లు కొరకు దొంగ బిల్లులు పెట్టి దోచుకునే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. అసలు మెడికల్ కళశాల నిర్మాణం కోసం ప్రభుత్వం, సింగరేణి నిధులతో పనులు వేరే కాంట్రక్టర్ చేస్తుంటే, మేయర్ గారి వాహనాలు, బినామీ వాహనాల పేరుతో కార్పొరేషన్ నిధుల నొక్కేసి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నగర పాలక సంస్థలో ఆన్లైన్ టెండర్లు ద్వారా పనులు చేసినవి కూడా ప్రతి ఫైల్ నా టేబుల్ పైకి వచ్చాకే నేను చూసాకే బిల్లులు పాస్ చేస్తా అనడం విడ్డురంగా ఉందన్నారు. ఇక మేయర్ గారి అనుచర వర్గ కాంట్రాక్టర్లకు మాత్రం ఇష్టానుసారంగా పనులు చేయకున్న తప్పుడు బిల్లులు ఫైల్స్ అప్రూవల్ చేయడం సరికాదన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు నీతిగా నిజాయితీగా కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ పనుల మీదనే ఆధారపడి ఇదే ఉపాధిగా జీవిస్తూ కుటుంబాలను చూసుకుంటున్నారు, కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్ల చేసిన పనులు మాత్రం వారి పనుల కావు అన్నట్లు వారివి బిల్లులు కవన్నట్లు చూస్తున్నారని ఆలాంటి ఆలోచన విధానాలు మేయర్ గారు మనుకోవాలని అందరిని ఒకేలా చూడాలని హితువు పలికారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *