తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను కూలీలుగా మార్చేందుకు కుట్ర!
…బహుజన సమాజ్ పార్టీ సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులను కూలీలుగా మార్చేలావ్యవహరిస్తోందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇప్పటికీ గురుకులాలను ప్రారంభించలేదన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం ఒక తరాన్ని కూలీలుగా మార్చే కుట్రగా పేర్కొన్నారు. ఇలాంటి వైఖరితో పిల్లలు భూస్వాముల ఇళ్లు, భూముల్లో కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గడీల పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.