మోడీ కెసిఆర్ లా కార్మిక వ్యతిరేక విధానాల కు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కండి.

ఏఐటీయూసీ 102వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి..

ఏఐటీయూసీ రామగుండం నగర అధ్యక్షులు శనిగరపు చంద్రశేఖర్ అబ్దుల్ కరీం లా పిలుపు

భారతదేశంలో 1920 అక్టోబర్ 31న బొంబాయి నగరంలో ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ ఆవిర్భవించింది స్వతంత్ర సమరయోధులు లాల లజపతిరాయ్ బాల గంగాధర్ తిలక్ జవహార్ లాల్ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వివి గిరి తో పాటు ఆనాటి కమ్యూనిస్టు కార్మిక సంఘాల నాయకులైన ఎస్ ఏ డాంగే ఇంద్రజిత్ గుప్తా పార్వతీ కృష్ణ ఏబీ బర్ధన్ హైదరాబాద్ సంస్థానంలో మగ్గం మోహయు ద్దీన్ రాజ్ బహుదూర్ గౌడ్ కే ఎల్ మహీంద్రా సత్యనారాయణరెడ్డి లాంటి పోరాట యోధులు కి నాయకత్వం వహించిన వారిలో ప్రముఖులు స్వతంత్రం కు ముందే కార్మిక సంఘాల చట్టం ఫ్యాక్టరీల చట్టం పారిశ్రామిక వివాదాల చట్టం కనీస వేతనాల చట్టం ప్రవిడెంట్ ఫండ్ చట్టం ఈఎస్ఐ చట్టాలను ఇతర హక్కులను ఆనాడు ఎలాంటి కార్మిక సంఘాలు లేని టైంలోనే ఏఐటీ యుసీ సాధించింది తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు కార్మికులు కనీస హక్కులు లేక మానవ హక్కులు లేక దుర్బర జీవితం అనుభవిస్తున్న కాలంలో సింగరేణి ఆర్టీసీ బ్యాంకులో రైల్వే ఇతర పరిశ్రమల్లో కాంట్రాక్టర్ల చేతుల్లో కార్మికులు దోపిడికి గురవుతున్న సమయంలో నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు మగ్గం మొహీనోద్దిన్ రాజ్ బహుదూర్ గౌడ్ కే ఎల్ మహేంద్రలాంటి ఉద్దండులైన ఏఐటిసి నాయకుల నాయకత్వంలో కార్మిక యూనియన్ లను స్థాపించి హక్కులను సాధించడం జరిగింది నేడు సింగరేణి కార్మికులు అనుభవిస్తున్న హక్కుల సాధనలో ఏఐటియు సి కృషి మరువలేనిది ఆర్టిసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు మెడికల్ ఎంప్లాయిస్ అంగన్ వాడి భవన నిర్మాణం హమాలి కాంట్రాక్ట్ కార్మికులు గుమస్తాలు మున్సిపాలిటీ ఎన్టిపిసి తదితర అసంఘటిత రంగ కార్మికుల కనీస హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఏఐటీయూసీ 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో ముఖ్యమైన 29 చట్టాలను మార్చి వ్యాపారం సులభతరం పేరుతో దేశ విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను పాలకులు అరంచి వేస్తున్నారు మే డే స్ఫూర్తితో సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానం పోయి 12 గంటల విధానం ప్రవేశ పెట్టబడుతున్నది పని ప్రదేశాల్లో సౌకర్యాలు రక్షణ హరించబడుతు ఉన్నాయి రాజ్యాంగం ఆదేశించిన సంక్షేమ రాజ్యం పూర్తిగా దోపిడి రాజ్యాంగ మారిపోయింది కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులు మూడు రైతు చట్టాలు విద్యుత్ సంస్కరణల చట్టం విద్యా చట్టం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో డిఫెన్స్ ఎంప్లాయిస్ సర్వీస్ చట్టం ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు అమ్మటానికి నేషనల్ నానిటైజేషన్ పైప్ లైన్ చట్టం పర్మినెంట్ ఉద్యోగాలు హరించే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ చట్టం అప్రెంటిసిలు దోచుకోవడానికి ఒక సంవత్సరం గా ఉన్న ట్రైనింగ్ ను ఏడు సంవత్సరాలకు మార్చే చట్టం ఇలా అనేక కార్మిక వ్యతిరేక చట్టాలను పారిశ్రామికవేత్తలకు దోపిడీదారులకు అనుకూలంగా తీసుకొచ్చింది ప్రజల నిత్యవసర వస్తువులపై పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి వస్తువులపై జిఎస్టి విధించి ధరలు విపరీతంగా పెంచుతుంది ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి వేయటం లేక ప్రైవేట్ పరం చేయటం కేంద్ర ప్రభుత్వానికి రోజువారి కార్యక్రమంలో ఉన్నది ప్రభుత్వ రంగంలో రక్షణ రంగం బ్యాంకులు ఇన్సూరెన్స్ బొగ్గు ఉక్కు గనులు విమానయానం రైల్వే కోర్టులు పోస్ట్ ఆఫీసులు బిఎస్ఎన్ఎల్ ఆయిల్ కంపెనీలు ఓఎన్జిసి బీఏఈ ఇం ప్రో లాంటి అనేక పరిశ్రమలను ఆదాని అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు చేసి ప్రైవేటు పరం చేయబడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న 70 చాటగిరీస్లో సంస్థకు గత పది సంవత్సరాలుగా కనీస వేతనాలను పెంచుటలేదు కనీస వేతన బోర్డు నియామాకం లేదు కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు నియామకం లేదు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న లక్షలాదిమంది కార్మికులను పర్మినెంట్ చేయకపోగా కనీస వేతనాలు ఇవ్వడం లేదు సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదు ఇలాంటి గడ్డు పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మికులు ప్రతినిత్యం వహిస్తున్న ఏఐటీయూసీ నిత్యం కార్మిక వర్గం వైపు ఉండి వారి హక్కుల సాధన కోసం మోడీ కేసీఆర్ ప్రభుత్వాలపై కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వారి హక్కుల కోసం పోరాటాలలో ముందుంటుంది కార్మిక వర్గానికి అండగా ఏఐటియుసి ఉంటుందని రేపు జరిగే 102వ ఏఐటిసి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మిక వర్గం పని చేస్తున్న పని స్థలాల్లో ఎర్రజెండాలు ఎగురవేయాలని ఏఐటీసీ నగర అధ్యక్షులు శనిగరపు చంద్రశేఖర్ ఏఐటీయుసీ సీనియర్ నాయకులు అబ్దుల్ కరీం లు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *