ఐ పి ఎల్ 2021 విజేత సి ఎస్ కే
…చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ ప్రతిభతో ఐపీఎల్ 2021 ఫైనల్ పోరులో విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ ఆధిపత్యం చెలాయించిన ధోనీ సేన నాలుగోసారి కప్‌ని గెలుచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 193 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా ముందుంచింది. కేకేఆర్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51), వెంకటేశ్ అయ్యర్ (50) శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు చెన్నై బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. 165 పరుగులకే ఆల్టాట్ అయింది. దీంతో మూడోసారి కప్ గెలవాలకున్న కల నెరవేరలేదు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు, జడేజా, హేజిల్‌వుడ్ చెరో రెండు, దీపక్ చాహర్, బ్రావో చెరో వికెట్ తీశారు.