గోదావరిఖని లో దొంగలు ఏదీ వదలట్లేదు!
దర్వాజ ప్రతినిధి: గోదావరిఖనిలో దొంగలు దేనిని వదలడం లేదు.. ఓవైపు ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతుండగా నగర శివారు ప్రాంతాలలో స్క్రాప్ బొగ్గు విచ్చలవిడిగా దొంగతనానికి గురవుతున్నాయి. తాజాగా పట్టణ శివారు లోని సంజయ్ గాంధీ నగర్ రైల్వే ట్రాక్ పక్కనుండి అక్రమంగా తరలిస్తున్న బొగ్గు ఉన్న లారీని సింగరేణి సెక్యూరిటీ గార్డు సిబ్బంది పట్టుకున్నారు.
మంగళ వారం ఉదయం ఎన్ టి పి సి కి వెళ్లే రైలు వ్యాగన్ల నుంచి దొంగలు అక్రమంగా సేకరించిన బొగ్గును తరలించే ప్రయత్నం చేశారు. నిఘా వేసిన సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. బొగ్గు స్వాధీనం చేసుకొని అర్జీ 1 జీ ఎం కార్యాలయం కి తరలించారు.
పట్టుకున్న వారిలో సీనియర్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి , ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ ,
ఏ సి టి ఎస్ టీమ్……
చంద .రఘు, నీలం .రవి,
జి .బాపూజీ , ఉన్నారు.