రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం.
రామగుండం కార్పోరేషన్ స్థానిక 5వ డివిజన్ లో వెంగళ బాపు గారి ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలతో నిర్వహించిన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ గారు పాల్గోని మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. తెరాస ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కినక హామీలను తుంగలో తోక్కరాని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందాని వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడూ ప్రజలకు వెన్నంటి ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాటం చేస్తూనే వుంటుందని అన్నారు. డివిజన్ ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చిన మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రజలందరు కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించిన వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పోరేటర్లు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.