పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ కి ఓటు వేయాలి!

రామగుండం కార్పోరేషన్ పరిధి జనగాంలో సోమవారం సాయంత్రం చేలుకల శ్రీనివాస్ యాదవ్, శివ, జనగామ నారాయణ గార్ల ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో నిర్వహించిన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ ….పాల్గోని మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. తెరాస ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కినక హామీలను తుంగలో తోక్కరాని ఆరోపించారు. సింగరేణికి భూములు దానం చేసిన ఘనత జనగామ ప్రజలు అని అన్నారు. దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేవరకు తెరాస నాయకులను మన వాడలకు రాకుండా అడ్డుకోవాలని అన్నారు. ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చిన కేసీఆర్ ఈరోజు ఉద్యోగాల్లేక యువకులు నిరుద్యోగులుగా మారారని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందాని వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడూ ప్రజలకు వెన్నంటి ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాటం చేస్తూనే వుంటుందని అన్నారు. డివిజన్ ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చిన మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రజలందరు కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించిన వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు….

ఈ కార్యక్రమంలో బొంతల రాజేశ్, ఎండీ ముస్తఫా, నగునూరి రాజు, కౌటం సతీష్, దుళీకట్ట సతీశ్, పీక అరుణ్ కుమార్, మహేశ్, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *