మెడికల్ కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
నవంబర్ 29న స్థానిక గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ కన్వీనర్ మాలెం మధు సందర్శించడం జరిగింది .ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ కళాశాల తరగతి గదులపై మెడికల్ కాలేజీకి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఇంతవరకు తొలగించలేదు మరియు ప్రభుత్వ కళాశాల కు సంబంధించిన భూమి గుండానే ప్రధాన కాలువ ప్రవహిస్తున్నది, ఈ కాలువ మీద సుందరీకరణకు సంబంధించి ఏర్పాటు చేస్తామని స్థానిక ప్రముఖ నాయకులు హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు నెరవేర్చలేదు, అలాగే కాలేజికి ఉన్న కాలువలో మూడు పందులు మరణించి దుర్వాసన రావడంతో విద్యార్థులు మరియు రోడ్డు పై వెళ్తున్న వారు ఇబ్బంది పడుతున్నారు మరియు కళాశాలకు సంబంధించిన కాంపౌండ్ వాల్ విషయంలో కూడా ఇప్పటివరకు ఏం పురోగతి లేదు. ప్రభుత్వ కాలేజీ ఆవరణలోనే ఇప్పుడు కూడా మెడికల్ కాలేజీ పనులు చివరి దశకు వచ్చాయని అలాగే ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నాము అని కెసిర్ గారు ప్రకటించారు మరియు విద్యార్థినులకు సంబంధించి బీసీ సంక్షేమ హాస్టల్ లో సరిపడా వసతి గదులు లేక విద్యార్థినిలు చాలా ఇబ్బంది పడుతున్నారు , వసతి గదులు అదనంగా తక్షణమే ఏర్పాటు చేయలని , సరిపడా వసతి గదులు లేకపోవడం వలన ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు కూడా తగ్గిపోతున్నాయని, అదె విధంగా కళాశాలకు R.O వాటర్ ప్లాంట్ ను మంజూరు చేస్తాము అని హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదు, కాబట్టి పై సమస్యలను దృష్టిలో పెట్టుకొని సంబంధించిన అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నం, లేని పక్షాన విద్యార్థులకు అండగా రాబోయే రోజుల్లో ఆందోళన చేపడతాం అని మాలెం మధు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దపల్లి పార్లమెంటరీ కన్వీనర్ మాలెం మధు తో పాటు కంది మల్లికార్జున్,రాజ్ దాసరి మరియు కళాశాల విద్యార్థులు తరుణ్, శ్రావణ్, నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు.