తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే సింగరేణిలో ప్రైవేటీకరణ!….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అండదండలతోనే సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణ జోరుగా సాగుతోందని బిఎమ్ఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య ఆరోపించారు. సోమవారం బి ఎం ఎస్ దాని అనుబంధ భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ..51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో ప్రైవేటీకరణ చేస్తూ… కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లడం వెంటనే మానుకోవాలని, సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయలేదని, భవిష్యత్తులో కూడా చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగా ప్రధాని ప్రకటించడం .పట్ల సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారని… రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి ఇప్పటివరకు 35 భూగర్భగనులలో 24 బొగ్గు బావులు పనిచేస్తున్నాయని,11 బొగ్గు బావులు మూసివేసారని, 2014 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 20వేల మంది కార్మికులు ఇంటి బాట పట్టారని ఆరోపించారు. 2015లో పార్లమెంటులొ ఎం ఎం డి ఆర్ చట్టం సవరణ చేసినప్పుడు పార్లమెంటులో ఆమోదానికి ఓటేసింది మీరు కాదా? కమర్షియల్ మైనింగ్ విధానంలో పారదర్శకత లోపించిందని కోర్టు తీర్పులను అనుసరించి పారదర్శకంగా కమర్షియల్ మైనింగ్ విధానం ప్రవేశపెడితే మద్దతు తెలిపిన మీరు….. ప్రైవేటీకరణ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్న కార్మిక సంఘాలు,రాజకీయ పార్టీలు అసలు రంగు రాజకీయ రంగులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు ……
ఈ కార్యక్రమంలో నాయకులు, కౌశిక హరి, సోమవారం అరుణ్ కుమార్, లావణ్య, బల్మూరి అమరేందర్రావు, కోమల్ల మహేష్, మహావాది రామన్న, బి ఎం ఎస్ ఆర్ జీవన్ నాయకులు ఆకుల హరిణ్ సాయవేణి సతీష్ ,వడ్డేపల్లి కుమారస్వామి, పల్లె శ్రీనివాస్,తాట్ల లక్ష్మయ్య సిరిపురం నరసయ్య, గాజుల వెంకటస్వామి, మాదాసు రవీందర్, సంగాని సాంబయ్య, రాపోలు వజ్ర వేణు, ఎల్లావుల కోటయ్య, సిహెచ్ రాజశేఖర్, యాదగిరి నరేష్, యాట శ్రావణ్, మెరుగు హరీష్, నీలం శ్రీనివాస్, రేణిగుంట్ల శ్రీనివాస్, అట్ల వెంకటరెడ్డి, సార్ల తిరుపతి, రాజ మహేందర్ రెడ్డి, జనగామ రాయలింగు, గుండెబోయిన భూమయ్య, ముసుకుల భాస్కర్ రెడ్డి, కొండ్ర ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు……..