కరాటే పోటీలలో ఖని విద్యార్థుల ప్రతిభ
కరీంనగర్ పట్టణంలో ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 19, 20, 21 తేదీలలో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గోదావరిఖని రెడ్ డ్రాగన్ కరాటే ఇన్స్ ట్యూట్ కు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు గెలుచుకునే ఈ ప్రాంతానికి వన్నె తీసుకు వచ్చారు. కుమ్తే విభాగంలో కె నిఖిల సిల్వర్ మెడల్, జి హమ్షిని గోల్డ్ మెడల్, కటా విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఎం కృతిక కటా విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఎం అఖిల్ కటా విభాగంలో గోల్డ్ మెడల్, కుమ్తే విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. అమేయ్ కుమార్ కుమ్తే లో గోల్డ్ మెడల్ సాధించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను సోమవారం రెడ్ డ్రాగన్ కరాటే ఇన్స్టిట్యూట్ ఫౌండర్, కార్యనిర్వాహకులు బ్లాక్ బెల్ట్ 7వ డాన్ కె మెండయ్య, కె క్రాంతికుమార్ లు ప్రత్యేకంగా అభినందించారు.