చెంప చెల్లుమనిపించిన సుప్రీం!
అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలపై ఇప్పటికే సెబీ లోతుగా పరిశీలిస్తూ, నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో ఉండగా, ఏం గుర్తించారో తమకు రెండు నెలల్లో దర్యాప్తు నివేదిక ఇవ్వాలని కూడా సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీజేఐ డీవై చంద్రచుడ్, జస్టిస్ పీఎస్నరసింహా, జస్టిస్ జేబీ పర్డివాలా బెంచ్నియమించిన నిపుణుల కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్ దర్, కేవీ కామత్, నందన్ నీలేఖని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ సభ్యులుగా ఉన్నారు. కేసు విచారణలో పూర్తి పారదర్శకత ఉండాలని.. అందుకోసం తామే ఒక కమిటీని నియమిస్తామని ఇటీవల స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఇవ్వాల నిపుణుల కమిటీని నియమించింది.