మక్కన్ సింగ్ సోదరుడు గుండెపోటు తో మృతి!

దర్వాజ: పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడు ఠాకూర్ శైలెందర్ (45) గుండె పోటుతో శుక్రవారం కన్నుమూసాడు.గత కొంతకాలంగా గోదావరిఖనిలోనే నివాసముంటున్న శైలేందర్ స్థానికంగా బిల్డర్ పనులు నిర్వహిస్తున్నాడు. ఉదయం చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .చికిత్స నిర్వహించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. మృతునికి భార్య ,ఇద్దరు పిల్లలు ,ఉన్నారు.ఈ ఘటన రామగుండం ప్రజలను శోక సముద్రంలో ముంచింది. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *