పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధించిన అర్ ఎఫ్ సి ఎల్!
రామగుండం ఫెర్టిలైజర్ &కెమికల్స్ లిమిటెడ్, తన పూర్తి స్థాయి ఉత్పత్తి 100% సామర్ధ్యాన్ని చేరుకుంది. సంస్థ మంగళవారం 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియను, 3852 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసి, పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యాన్ని చేరుకుంది.ఈ సందర్భంగా, సంస్థ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధించటంలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు RFCL ముఖ్య కార్య నిర్వహణ అధికారి అభినందనలు తెలిపారు. అలాగే సంస్థకు మద్దతుగా ఉన్న రాష్ట్ర, జిల్లా యంత్రాంగానికి, కేంద్ర ఎరువులు, రసాయానాలు మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.