తెరాస సమన్వయ కమిటీ సభ్యుడిగా జడ్సన్ నియామకం

రామగుండం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా బాసంపల్లి జడ్సన్ ను రామగుండం ఎమ్మెల్యే, తెరాస పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో విద్యార్థి విభాగానికి మూడు సార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా, విద్యార్థులను ప్రజలను చైతన్య పరుస్తూ, కెసిఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును తూచా తప్పకుండా పనిచేస్తూ, రామగుండం నియోజకవర్గంలో ఉద్యమ నాయకుడు కోరుకంటి చందర్ అన్న వెంట నడుస్తూ ఉద్యమానికి ఊపిరి పోసిన, జడ్సన్ కు నియోజకవర్గ స్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేసేందుకు సమన్వయ కమిటి సభ్యుడిగా నియామకం కావడంపట్ల పలువురు ఉద్యమకారులు, పార్టీ శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జడ్సన్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యే చందరన్న కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *