త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమయ్యే సమయం సమీపిస్తున్నoదున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ఆదేశించారు. శనివారం గోదావరి పుష్కర ఘాట్ వద్ద గల సమ్మక్క సారలమ్మ గద్దెలను సందర్శించి జాతర నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎం ఎల్ ఏ కోరుకంటి చందర్ ఆదేశించారని అన్నారు. దేవాదాయ శాఖ, సింగరేణి , ఎన్ టి పి సి , ఎన్ పి డి సి ఎల్ తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో జాతర కమిటీ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి నది వద్ద ప్రమాదానికి గురి కాకుండా ఫెన్సింగ్ వేయాలని ఆదేశించారు. విద్యుత్ దీపాలు మునిసిపల్ అమరుస్తుoదని వాటికి సింగరేణి , ఎన్ పి డి సి ఎల్ ద్వారా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు జనరేటర్ తో వెలిగేలా చూస్తామని అన్నారు. మరుగు దొడ్లు , మూత్ర శాలలు కూడా అవసరమైనన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ధాతు శ్రీనివాస్ , నగర పాలక సంస్థ ఇఇ మాధవి , సింగరేణి అధికారులు , దేవాదాయ శాఖాధికారులు , జాతర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.