విద్వేషాలను రెచ్చగొడుతున్నారు!

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జీ1, బ్రాంచి కమిటీ ఆధ్వర్యంలో, జిడికే1, 2ఏ లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సామాజిక ఉద్యమ నిధి కార్మికుల నుంచి సేకరించడం జరిగింది, ఏప్రిల్ 6న కామ్రేడ్ బీటీ రణదివే,
11న జ్యోతిబాపూలే 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి,
మహానీయుల జయంతులు వర్ధంతులు ను పురస్కరించుకొని,
ఏప్రిల్ 1 నుండి 20 వరకు కులవివక్ష అణచివేత కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపెయిన్ చేయాలని సిఐటియు నిర్ణయించింది,…


సామాజిక ఉద్యమాలకు కార్మికవర్గం అండగా నిలవాలని ఉద్యమాలకు ఉద్యోగులు కార్మికులు విరివిగా విరాళాలు ఇచ్చి ఈ క్యాంపెయిన్ జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సామాజిక ఉద్యమ
నిధి సేకరించడం జరుగుతుందని,
సామాజిక ఉద్యమ నిధిని అందించిన అర్జీ1,
కార్మిక సోదరులకు విప్ల జేజేలు,…అని
….అర్జీ1 కార్యదర్శి మెండె శ్రీనివాస్ తెలియజేశారు,
బిజెపి ప్రభుత్వం వేల సంవత్సరాల నాటి బూజుపట్టిన…
మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ….
ప్రయత్నం చేస్తున్నది …..
మతం పేరుతో…
దేశ భక్తి ముసుగులో ప్రజలు కార్మికుల్లో చిచ్చు పెడుతుందని,
దళితులు గిరిజనులు మహిళలపై విచ్చలవిడిగా రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేస్తుందని జాతీయ వనరులను …
ప్రభుత్వరంగ సంస్థలను తన తాబేదారులకు….
కట్టబెడుతున్నారని కార్మిక సంఘాలు కార్మిక హక్కులు కార్మిక చట్టాల పై దాడులు చేస్తున్నది ఈ దుర్మార్గ విధానాలను…..
ప్రతిఘటించేందుకు ప్రజలు కార్మికులు ఐక్యం కాకుండా మతోన్మాదాన్ని రెచ్చ గొడుతున్నది…. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కుల మత విద్వేషాన్ని రెచ్చగొట్టి చిచ్చుపెట్టి పేదలు కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని, 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు

లేబర్ కోడ్స్ తెచ్చి,
కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమాలు చేయకుండా బావోద్వేగలను సృష్టిస్తున్నది,
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ఉనా పట్టణంలో ఆవు మాంసం వలుస్తున్నారనే నెపంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టి తమ కరు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు,
ఒక దళితుడు గుర్రం ఎక్కడని కిందపడేసి కొట్టి చంపారు, యూపీలో ఒక దళిత యువతిని గ్యాంగ్ రేప్ చేసి నాలుక కోసి నడుములు విరిచనా….
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా తీసుకోలేదు,
హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణిస్తే కనీసం ఆ శవాన్ని కూడా కుటుంబానికి ఇవ్వలేదు ఇలాంటి దారుణాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరెన్నో జరుగుతున్నాయి, వీటన్నిటిని మానవీయ కోణంలో ప్రతి మనిషికి ఖండించాలని సిఐటియు విజ్ఞప్తి చేస్తుంది.


ఈ కార్యక్రమంలో, అర్జీ1, కార్యదర్శి, మెండె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు, బూరుగుల రాములు, వంగల శివరాంరెడ్డి, అటీయ, దాసరి సురేష్, సాయి కృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *