జీడికే 2ఏ గనిపై స్వచ్ పక్వాడా..!

గురువారం ఆర్జీ-1 పరిధి జిడికె 2ఏ గని పై స్వచ్ఛ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. గని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిడికె 2, 2ఏ గని మేనేజర్ రామస్వామి, సేఫ్టీ ఆఫీసర్ డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా సింగరేణి సి,ఎం.డి శ్రీధర్ సూచనమేరకు ఆర్జీ-1 జిఎం కలువల నారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గని పై పరిశుభ్రత, చెట్ల పెంపకంలో శ్రద్ధ వహిస్తున్న సేఫ్టీ ఆఫీసర్ దొంత వెంకటేశ్వర్లు, గని ఇన్చార్జ్ తాటిపాముల శంకర్, వర్క్ మెన్ ఇన్ స్పెక్టర్ అయాజ్, మైనింగ్ సర్దార్ మేజిక్ హరిని అభినందించారు. ఇంకా కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఫిట్ సెక్రెటరీ దొరగండ్ల మల్లయ్య, కళాధర్, గుమ్మడి పెద్దులు, పాపారావు, కనకయ్య, గడ్డం కొమురయ్య, మిట్టపల్లి సాంసన్, వి.రమేష్, హెడ్ ఓవర్మెన్ బండి ఐలయ్య గని ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *