సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించె “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్” !

గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ *పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి * ఆదేశానుసారం గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ .. ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్ హాస్పిటల్ పోచమ్మ గుడి (దూల్ పేట)లో మొత్తం 60 అధికారులు సిబ్బంది తో *”కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్”* కార్యక్రమం (సిసిపి) నిర్వహించడం జరిగింది….గోదావరిఖని ఏసీపీ …. మాట్లాడుతూ…ప్రజలు రక్షణ పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత బస్తిలుగా, గ్రామలుగా చేయలనే ఉద్దేశ్యం గురించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. నేనుసైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలోని ప్రజలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.◆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన అమాయకులైన ప్రజలను కేసుల నుండి రక్షించవచ్చు, మరియు గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చునని ఏసిపి గారు తెలిపారు.👉 ఎలాంటి పేపర్లు లేని మోటార్ సైకిల్స్ 83, Autos-05, total- 88 వాహనాలను,2000 రూపాయల గుట్కా సీజ్ చేసినారు👉ఈ రోజు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు వాటికి సంబంధించిన పత్రాలు చూపించిన తర్వాత తిరిగి వారి వాహనాలను వారికే అప్పగించడం జరుగుతుందని తెలిపారు👉 ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు,ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపినారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఈ మధ్యకాలంలో హెల్మెట్ లేక కొందరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా భావించి ధరించాలని సూచించారు.పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని డాక్యుమెంట్స్ లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని తెలిపినారు.

👉మీ ప్రాంతం లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ తిరుగుతున్న మరియు గ్రామం లో చుట్టుపక్కల కాలనీ లో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుడుంబా,గుట్కాలు అమ్ముతున్నా, పేకాట ఆడిన వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.👉యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని వారి తల్లిదండ్రులకు మరియు వారి ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలను రక్షించడానికే తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపినారు.👉 సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతోమంది తమ విలువైన డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే బ్యాంకు సంబంధించిన వివరాలు, ఓటిపి తదితర నెంబర్లు ఎవరికీ తెలియపరచ కూడదు వాట్స్అప్ లలో అనుమానాస్పదంగా వచ్చే బ్లూ కలర్ మెసేజ్లను క్లిక్ చేయకూడదు ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి లేదా https://cybercrime.gov.in వెబ్సైట్ నందు ఫిర్యాదు చేయగలరు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే కాల్స్, మెసేజెస్, LiNKS నమ్మి మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలను, OTP, KYC, అనుమానస్పద లింక్స్, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలను ఎవ్వరితో పంచుకోవద్దు అని తెలియపరిచారు👉తరచుగా, గ్రామాలలో పట్టణాలలో, కాలనీలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లు రమేష్ బాబు, రాజ్ కుమార్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్ రావు, ఎస్ డి ఆఫ్జాలోద్దీన్,1టౌన్,2 టౌన్,రామగుండం, అంతర్గం ఎస్ఐ లు, సిబ్బంది 60 మంది పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *