జాతర పనుల పరిశీలన!
గోదావరిఖని సమ్మక్క జాతర నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ బుధవారం పరిశీలించారు. జాతర సమయం సమీపిస్తున్నందున పనుల్లో వేగం మరింత పెంచాలని అధికారులకు ,కాంట్రాక్టర్ లకు సూచించారు.
జాతర ప్రాంగణం లో ఫ్లోరింగ్,పెయింటింగ్ తదితర పనులు చురుగ్గా సాగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు మాధవి,జమీల్,షాబాజ్ తదితరులు పాల్గొన్నారు.