ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి!
రామగుండం పోలీస్ కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ …ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) … హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్ సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ….వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, యూనిటీ గా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్, సిబ్బంది కి డ్యూటీ, సర్వీస్, ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుంది. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది క్రమశిక్షణ, నిబద్దతతో పని చేస్తున్నారన్నారు. ఇంకా మంచిగా ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేస్తూ పోలీస్ శాఖ కి, రామగుండం పోలీస్ కమిషనరేట్ కి మంచి పేరు తెచ్చే లాగా పని చేయాలని ఏదైనా సమస్య ఉంటే ఆఫీస్ కి రావచ్చు అని సిబ్బంది కి సీపీ గారు తెలిపారు.ఈ పరేడ్ లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ ఐపిఎస్,, ట్రాఫిక్ ఏసీపీ బాల రాజు, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, ఆర్ఐ లు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్ గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ , గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు ఎస్ఐ, ఆర్ఎస్ఐ, పీఎస్ఐ లు, సిబ్బంది హాజరయ్యారు.