నాలుగు బస్సులు కాదు నాలుగు వందల బస్సు లైన సరే!
ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. …..ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వెనక్కు తీసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలు, జరిగిన అభివృద్ధిని పరిశీలించేందుకు నాలుగు బస్సులు కాదు, నాలుగు వందల బస్సులతో ఏపీకి రావాలని మంత్రి గుడివాడ అమరనాథ్ కేటీఆర్‌ను ఆహ్వానించారు.