జీవిత శిఖరాల పై అధిరోహించాలి!

గోదావరిఖని,ఏప్రిల్ 13,(దర్వాజ).. స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) విభాగం ఆధ్వర్యంలో నూతన విద్యార్థిని విద్యార్థులకు స్వాగత ఉత్సవాన్ని (freshers party) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజరైన విద్యార్థులు అందరూ కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు అంతేకాకుండా కళాశాల లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భౌతిక శాస్త్ర విభాగ అధిపతి సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగానికి అవసరమైన వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డాక్టర్ రమేష్ విద్యార్థులకు ఉపయోగపడే వివిధ సూచనలు చేశారు సీనియర్ మరియు జూనియర్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యకలాపాలు అలరించాయిఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమాకాంత్ అధ్యాపకులు సురేష్ కుమార్ రమేష్ అజయ్ రవి ప్రసాద్ సావిత్రి సల్మా మరియు ఎమ్మెస్సీ ఎం కామ్ ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *