బహిరంగ సభకు భారీగా తరలిరండి!
భారతీయ జనతా పార్టీ జూలై మూడవ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభను విజయవంతం చేయడానికి శుక్రవారం రామగుండం నియోజకవర్గం సన్నాహక సమావేశాన్ని భారతీయ జనతాపార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో ….ఖనిలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వహించారు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ ,బిజెపి పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామ్నాథ్ ,రామగుండం నియోజకవర్గ ప్రభారి పాల్వాయి హరీష్ పాల్గొని జూలై 3న జరిగే సమావేశం ని విజయవంతం చేయడం కోసం పలు సూచనలు చేస్తూ మండల వారీగా ఇన్చార్జిల నియమిస్తూ రామగుండం నియోజకవర్గం నుండి దాదాపుగా పదివేల మందిని తరలించాలని ఒక్కొక్క బూతు నుండి 30మంది కార్యకర్తలతోపాటు పార్టీ సానుభూతిపరులు ఇతరులను తరలించాలని వారు సూచించారు..
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్……కేసీఆర్ ప్రజల అభిమానాన్ని కోల్పోయారని, తెలంగాణలోని ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ,తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడం లక్ష్యంగా జాతీయ నాయకత్వం, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం దానిలో భాగంగానే జింఖానా గ్రౌండ్లో భారీ ఎత్తున 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, తద్వారా నిరంకుశ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి, రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడానికి దిక్సూచి కావాలని పిలుపునిచారు… ..
నియోజకవర్గంలోని ప్రజలకు పార్టీ కార్యకర్తలకు….. అనేక సందేహాలున్నా రామగుండం నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నాయకులు అందర్నీ కలుపుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ప్రతి ఒక్క కార్యకర్త ను ,ప్రతి ఒక్క నాయకుని, సముచిత స్థానం ఇస్తూ రామగుండం నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేయడం, పార్టీ నుండి పోటీ చేస్తానని , పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు తెలిపారు….ప్రత్యేకంగా కార్యకర్తలందరికీ ప్రజలందరికీ ఉన్న అపోహలను బిజెపి నుండే పోటీ చేస్తానని అన్నారు..
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య,వడ్డేపల్లి రామచందర్, బల్మూరి అమరేందర్రావు, కేతం వెంకటరమణ, మాతంగి రేణుక, నాయకులు గాండ్ల ధర్మపురి,మంచి కట్ల బిక్షపతి, బిజెపి కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి తడగొండ నరసయ్య, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కుసుమ కుమారి ,ఇ ఓ బి సి మోర్చా జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బద్రి దేవేందర్, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్, మండల అధ్యక్షులు కోమల్ల పురుషోత్తం, దాసరి శ్రీనివాస్ మిట్టపల్లి సతీష్ ,కర్రావుల డేవిడ్ రాజ్ ,పెండ్యాల రవికుమార్ ,మండల ప్రధాన కార్యదర్శి బోడకుంట సుభాష్, మల్లేష్, బిజెపి కార్పొరేషన్ ఉపాధ్యక్షులు శీతకారి చంద్రశేఖర్ ,జనగామ సాగర్, బిజెపి కార్పొరేషన్ కార్యదర్శి గుర్రాల సందీప్ కుమార్, అహంకారి భరత్, బిజెపి కార్పొరేషన్ దళిత మోర్చా అధ్యక్షులు కమలాకర్, బీసీ మోర్చా కార్పొరేషన్ అధ్యక్షులు చుక్కల రాములు ,అజీమ్ ఉద్దీన్, చల్లా శ్రీనివాస్ ,భాష బోయిన వాసు, అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు..
….