తబితా ఆశ్రమంలో ఘనంగా సామూహిక పుట్టినరోజు వేడుకలు

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని తబితా ఆశ్రమంలో సిం పర్సనల్ సెక్రటరీ గౌ: స్మిత సబర్వాల్ .. (స్మితం హితం ఫౌండేషన్) గారి ఆశీస్సులతో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ మరియు మాదిరెడ్డి ఇందుమతి భాస్కర్ రావ్ చారిటబులు ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ముఖ్యాతిధులగా పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణి పోచం, కార్పొరేటర్లు మంచికట్ల దయాకర్, కన్నూరి సతీష్ కుమార్, గార్లు హాజరై మాట్లాడుతూ నేటి సమాజంలో బాల బాలికలు అన్ని రంగాల్లో ముందుండి వారి యొక్క హక్కులను సంపూర్ణంగా పొందాలని సూచించారు. చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలన్నారు. పిల్లలు చదువుల్లోనే కాకుండా ఆటపాటల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందేలా ఉండాలని అన్నారు. బాలబాలికల్లో నిగుఢీకృతంగా దాగిఉన్న శక్తిని వెలికి తీసి ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని అన్నారు. గౌ: స్మిత సబర్వాల్ … ఆశీస్సులు పిల్లలకు ఉండటం గొప్ప విషయం అని అన్నారు. దాదాపు పది ఏండ్ల నుండి సమూహిక పుట్టినరోజు వేడుకలు మద్దెల దినేష్ పిల్లలకు నిర్వహించడం గొప్ప విషయం అని దినేష్ ని అభినందించారు. అనంతరం పిల్లలతో బారి కేక్ కట్ చెపించారు, మరియు పిల్లలకు కొత్త బట్టలు మరియు బియ్యం, స్వీట్లు, పండ్లు, భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెల్త్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఐకేపీ, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ ఎన్ జి ఓ ల ప్రతినీదులు నరేంద్ర, గడప శ్రీకాంత్, రమేష్, రవీందర్, శ్రీనివాస్, కుమార్, రామస్వామి, పద్మ, శోభ, సంతోష్, రాకేష్, శ్రవణ్, విజయ, మరియు నిర్వాహకులు వీరేందర్ విమల దంపతులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *