భారత్ జోడో యాత్ర ను విజయవంతం చేయండి!..

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడోయాత్రను విజయవంతం చేయాలని దాని అనుబంధ ఐ ఎన్ టి సి సంఘం నాయకులు జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు ఆదివారం పట్టణంలోని ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన యాత్ర వివరాలతో పాటు పలు అంశాలను వెల్లడించారు…గత ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో పాలిస్తున్న మోడీ ప్రజల ఆశయాలకు అనుగుంగా పనిచేయకుండా దేశంలో ద్వేష భావన పెంచి, ప్రాంతీయ మత వేబేదాలు పెంచారని అంతే కాకుండా గత 70 ఏళ్లుగా ఎన్నడూ లేనివిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను దౌర్భాగ్య స్థితి కి తిసుకవచ్చారని దేశం లో దరిద్రం పెరిగిపోయిందని , యువత ఉద్యోగాలు లేక అవస్త పడుతున్నారని , పెట్రోల్ డీజిల్ మరియు నిత్య అవసరాల ధరలు పెరిగి పోయి సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా చేశారని బీజేపీయితర రాష్ట్రాలలో ప్రభుత్వాలను కుల్చడమే పని గా బీజేపీ ప్రభుత్వం పాలిస్తుందని రాష్ట్రంలో కెసిఆర్ 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విఫలమయ్యారని దళితులకు ముడేకరాల భూమి ఇస్తా అని ఇవలేదని కాంగ్రెస్ హయం లో అనేక ప్రాజెక్టులు విద్యా సంస్థల నెలకొల్పిందనీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం తెలంగాణాలోకి ప్రవేశించిదని…. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగుతున్న ఈ యాత్రలో.. ఐదో రాష్ట్రం తెలంగాణ… భారత్ జోడో యాత్ర తెలంగాణలోనే 1500 కిలోమీటర్ల మైలురాయిని దాటనుందని ఈ యాత్రకు దేశం లోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనీ, అంతే కాకుండా దేశం లోని పారిశ్రామిక వేత్తలు జర్నలిస్టు లు లే కాకుండా విదేశాల నుండి కూడా విశేష ఆదరణ వస్తుందని ఈ యాత్ర తరువాత 56 అడుగుల ఛాతీ గల ప్రబుద్ధుడు లిల్లీపుట్ అయ్యే అవకాశం ఉందని భారత దేశం లో రాహుల్ గాంధీ అతిపెద్ద నాయకుని గా మారే అవకాశం ఉందని ఈ యాత్రకు రామగుండం అసెంబ్లీ నియోజక వర్గం, సింగరేణి కార్మికులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను వియవంతం చేయాలని కోరారు………..

ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిద్దం శెట్టి రాజమౌళి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి కుమార స్వామి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , సీనియర్ నాయకులు లక్ష్మీపతి గౌడ్ , దాస్ , అక్బర్ అలి , దేవి భూమయ్య , నరేందర్ , వికాస్ కుమార్ , శ్రీను , సదానందం , మనోహర్ , గుడేటి శ్రీనివాస్ , సాగర్ , మార్కండేయ, పిట్ కమిటీ నాయకులు బ్రాంచ్ కమిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు……..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *