రైతు సాగు చట్టాలు రద్దు

నూతన సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. గురునానక్ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. “అన్నదాతల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తాం. వ్యవసాయ బడ్జెట్ను ఐదు రెట్లు పెంచాం” అని మోదీ తెలిపారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *