దుకాణాల వద్ద వధిస్తే లైసెన్స్ రద్దు !
పశువధశాలలో కాకుండా దుకాణం వద్ద మేకలు , గొర్రెలు వధిస్తే మూడు వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు మాంసం స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి. సుమన్ రావు హెచ్చరించారు. మంగళ వారం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం సిబ్బంది ఆద్వర్యంలో ఎన్ టి పి సి , శివాజీ నగర్ , కళ్యాణ్ నగర్ ప్రాంతాలలోని మాంసం దుకాణాలలో తనిఖీలు నిర్వహించి సుమారు 30 మంది వ్యాపారులు పశువధ శాల ముద్ర లేకుండా మాంసాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. పారిశుద్ధ్య సిబ్బంది ఈ మాంసాన్ని స్వాధీనం చేసుకోగా వారంతా మున్సిపల్ కార్యాలయం చేరుకొని మొదటి తప్పుగా భావించి వదిలేయాలని కమిషనర్ బి. సుమన్ రావును వేడు కున్నారు. మరొక సారి పశువధశాలలో కాకుండా దుకాణాల వద్ద వధిస్తే లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించి వదిలేశారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ సెక్రెటరీ రాములు , హెల్త్ అసిస్టెంట్ లు వైకుంటం , కిరణ్ వున్నారు.