ఖని ప్రభుత్వ ఆస్పత్రికి సూపరిండెంట్ లేరా?
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కు ప్రభుత్వ ఆస్పత్రి పై అజమాయిషీ ఎందుకు?
ఆస్పత్రిలోని సిబ్బంది ని ఇబ్బంది పెడుతున్న ప్రిన్సిపాల్ ను బదిలీ చేయండి .
ఆస్పత్రి నిర్వహణ కోసం నూతన సూపరిండెంట్ ను నియమించాలి.
మెడికల్ కళాశాల గేటుకు ఉద్యోగాలు అమ్మబడునని బోర్డ్ పెట్టుకోండి.
గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి అసలు సూపరిండెంట్ ఉన్నారా? ఉంటే ప్రిన్సిపాల్ ఆసుపత్రిలో పెత్తనమేంటని, ఆసుపత్రి లో నూతన సూపరింటెండెంట్ ను నియమించాలని, ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న మెడికల్ కళశాల ప్రిన్సిపాల్ బదిలీ చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్, నగర సహాయ కార్యదర్శి మద్దెల దినెష్ లు ఒక సంయుక్త ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కాలేజీ బాధ్యతలను చూసుకోవాల్సింది పోయి ఆస్పత్రి నిర్వహణ మరియు అందులో పనిచేస్తున్న సిబ్బంది పై వేధింపులకు గురిచేయడమేంటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రినా లేక ప్రయివేట్ ఆస్పత్రినా అని వారు పేర్కొన్నారు. అనేక రాజకీయ పార్టీలు, యూనియన్ లు, పలు స్వచ్చంధ సంస్థలు పోరాటాలు చేయడం వల్ల ఈ ప్రాంతంలో మెడికల్ కళశాల మంజూరు అయితే అందరికి విద్య, వైద్య పరంగా సౌకర్యంగా ఉంటుందని అనుకుంటే, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యావిధన్ పరిషత్ నుండి డైరెక్టరేట్ మెడికల్ ఎడ్యుకేషన్ గా మారిన ఆస్పత్రి ఏ మాత్రం అభివృది చెందకపోవడం దురదృష్టకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.దాదాపు 330 పడకల ఆస్పత్రికి అన్ని రకాలుగా అనుభవం ఉన్న వ్యక్తిని అందరికి అందుబాటులో ఉండే వైద్యున్ని సూపరిండెంట్ గా నియమించాల్సి ఉండగా, మెడికల్ కళశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వ ఆస్పత్రి చూసుకోవడం వారి పెత్తనమేంటని వారు విమర్శించారు.ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని టార్గెట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం ప్రిన్సిపాల్ విధానం సరైంది కాదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి ప్రిన్సిపాల్ కు ఎలాంటి సంబంధం లేకుండా చూడాలని యుద్ధప్రాతిపదికన నూతనంగా సూపరిండెంట్ ను ప్రభుత్వం నియమించాలని వారు జిల్లా కలెక్టర్ ను మరియు డి.ఎం.ఈ ని వారు కోరారు.అదే విధంగా మెడికల్ కళశాల ముందు ఉద్యోగాలు అమ్మబడను అని బోర్డ్ పేట్టుకోండని వారు ఎద్దేవా చేశారు. ముఖ్యప్రజా ప్రతినిది మరియు ముఖ్య అధికారి కుమ్మకై ఆస్పత్రిలో వివిధ శాఖలలో పనిచేస్తున్న కొంతమంది దళారులను ఏర్పాటు చేసుకొని ఉద్యోగాలు అంగట్లో సరుకుల్లాగా అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా ప్రకటనలు లేకుండా శానిటేషన్ విభాగంలో స్వీపర్లు, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు రెండు నుండి మూడు లక్షల వరకు అమ్ముకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇట్టి విషయాలపై త్వరలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ మరియు డిఎంఈ గార్లను త్వరలో కలుస్తామని వారు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.