ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కి మొట్టికాయలు!
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తప్పుబట్టింది. డయాబెటీస్, అధిక ఒత్తిడిలు గుండె సమస్యలకు కారణం కాదని, వైద్య ఖర్చులు రూ.2.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2013లో రంగారెడ్డి జిల్లాకు చెందిన వి. హరిశ్చంద్రారెడ్డి రూ. 5 లక్షలకు హెల్త్ పాలసీ తీసుకున్నారు. 2014లో బైపాస్ సర్జరీ చేయించుకోగా రూ.4.5 లక్షలు ఖర్చయింది. ఈ మొత్తానికి క్లెయిం కోరినా, వినతి పత్రం, నోటీసు ఇచ్చినా స్పందించకపోవడంతో అనైతిక వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతోందని, సేవాలోపమంటూ ఆయన జిల్లా ఫోరమ్ ను ఆశ్రయించారు…