మోదీ విధానాలను ప్రతి ఖండించాల్సిందే!
గోదావరిఖని శ్రామిక భవన్, సిఐటియు కార్యాలయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల సిఐటియు వర్క్ షాప్ జరిగింది.ఈసమావేశానికి పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు అధ్యక్షత వహించగా…. ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ … హాజరై మాట్లాడుతూ 1886 లో అమెరికాలోని చికాగో నగరం హే మార్కెట్లో 8 గంటల పనిదినం అమలు,వెట్టిచాకిరి విముక్తి, కనీస హక్కుల కోసం పెద్దమొత్తంలో కార్మికులు పోరాటం చేసారని అన్నారు.ఆ పోరాటంలో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు కార్మిక నాయకులు మరణించారని,అనేకమంది గాయాల పాలయ్యారని,అక్రమ అరెస్టులు అయ్యారని అన్నారు. ఆ పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న 8 గంటల పనిదినం,ఇతర హక్కులు అన్నారు.అనేక త్యాగాల సాక్షిగా ప్రపంచ కార్మికవర్గం పోరాట స్ఫూర్తి దినం మేడే అన్నారు… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కష్టజీవులు జరుపుకునే ఏకైక రోజు మేడే అని అన్నారు.ఈ మేడే ను పండుగలా కాకుండా అంతర్జాతీయ పోరాట దినంగా జరుపుకోవాలని సిఐటియు పిలుపు నిస్తుందని అన్నారు…ఈ మహత్తర పోరాటాన్ని, సాధించిన విజయాలను సహించలేని మతోన్మాద బిజెపి పార్టీ నేతలు మేడే రోజును,కార్మికుల త్యాగాలను కనుమరుగు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అన్నారు.అందులో భాగంగానే బిజెపి నాయకులు విశ్వకర్మ జయంతిని ముందుకు తెచ్చి కార్మికులను తప్పుదోవ పట్టించే విదంగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.నేడు దేశాన్ని పాలిస్తున్న మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ,ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని అన్నారు…నేడు అనుభవిస్తున్న 8 గంటల పనిదినం స్థానంలో 10,12 గంటల పనిదినాలు తీసుకురాబోతుందని అన్నారు.ఈ ప్రమాదకరమైన బిజెపి, నరేంద్రమోదీ విధానాలను ప్రతిఘటించకపోతే రాబోవు రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతామని అన్నారు.ఈ 136 వ మేడే దినోత్సవ స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి హక్కులు సాదించుకోవడంలో ముందుండాలని,మేడే వారోత్సవాలు జయప్రదం చేయాలని అన్నారు. ..ఈ వర్క్ షాప్ లో రాష్ట్ర కార్యదర్శి త్రివేణి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శ్రీకాంత్,జి.ముకుంద రెడ్డి,పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమురం భీమ్ జిల్లాల నాయకులు వేల్పుల కుమారస్వామి, యూ.శ్రీనివాస్,ఎడ్ల రమేష్,రమణ,ఎల్లయ్య, తిరుపతి నాయక్, రాజేశం, ముంజమ్ శ్రీనివాస్, ఆనంద్, రాజేశ్వరి, జ్యోతి, కొమురయ్య, రామాచారి,శ్రీనివాస్, శంకర్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.