పండ్లు, శీతల పానీయాలు పంపిణీ..!
గోదావరిఖని,ఏప్రిల్ 13,(దర్వాజ) రామగుండం లో ఉన్న తబితా బాలల సంరక్షణ కేంద్రం లో బుధవారం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు *మద్దెల దినెష్* తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముందుగా ఆమె చిత్రపటానికి పులా మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం *మద్దెల దినెష్* మాట్లాడుతూ తబితా బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు వీరేంద్ర నాయక్ కుమార్తె తబితా అనారోగ్యం తో అకాల మరణం చెందడం వల్ల వారి కుటుంబ సభ్యులకు, ఆశ్రమానికి తీరని లోటని పేర్కొన్నారు. తబిత ఆశ్రమం లో ఉన్న పిల్లలకు ఆటలు,పాటలు మరియు విద్య ను ఎంతో ఉల్లాసంగా,ఉత్సాహంగా అందించేదని ఆయన పేర్కొన్నారు. తబిత యొక్క ఆశయ సాధన కోసం ఆశ్రమ పిల్లలు కృషి చేయాలని, ఆశ్రమంలో ఆమె లేని లోటును తీర్చే విధంగా పిల్లలు ఉండాలని ఆయన సూచించారు. అనంతరం ఆశ్రమం లో ఉన్న పిల్లలకు పండ్లు, శీతల పానీయాలతో పాటు బోజనాలు పెట్టించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు చిట్టూరి వివేక్, నరేందర్, శ్రీనివాస్, ప్రేంకుమార్, రాజ్ ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు….