బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్!
స్థానిక గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆఫీస్ గౌతమి నగర్ మరియు ఎల్కలపల్లి లో ట్రస్ట్ నిర్వాహకురాలు సోమారపు లావణ్య అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకుడు అని, వారు రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడు ఆదర్శంగా తీసుకోవాలని, వారి జయంతి ని జరుపుకోవడం ఎంతో గౌరవప్రదమైన విషయమని పేర్కొన్నారు ..ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రైనర్స్ శిరీష, మౌనిక, మాదవి, సాయిలత ట్రస్ట్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.