కమిషనరేట్ లోని గోదావరిఖని ఏసీపీ గా విధులు నిర్వహిస్తున్న గిరి ప్రాసాద్ ని మంగళవారం ... ఏసీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మద్దెల దినేష్, రేణికుంట్ల నరేంద్ర, యంపటి శ్యామ్ రాజ్ కలిసి ఇటీవల ప్రభుత్వం నుండి పురస్కారం అందుకున్న తరుణంలో వారిని కలిసి ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు.
అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ ఏసీపీ వృత్తి ధర్మాన్ని గౌరవిస్తూ సక్రమంగా విధులు నిర్వహిస్తున్న తరుణంలో ప్రభుత్వం గుర్తించి ఉత్తమ సేవలు అందించినందుకు కేంద్రం ప్రకటించిన పురస్కారం రాష్ట్ర హోమ్ మంత్రి, డీజీపీ చేతుల మీదుగా తీసుకోవడం శుభపరిణామం అని, ఈ పురస్కారం ఏసీపీ కి లభించడం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికే గర్వకారణం అని అన్నారు.
అదే విధంగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ సమస్యలను ఏసీపీ గిరిప్రసాద్ ....దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించారని మద్దెల దినేష్ తెలిపారు.
Post Views: 152