సేవా స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం!
గోదావరిఖని,ఏప్రిల్ 14 (దర్వాజ)రామగుండం కార్పొరేషన్ 14 వ డివిజన్ పరిధిలోని రిక్షా కాలనిలో…. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ అంబెడ్కర్ 131 వ జయంతి సందర్భంగా రిక్షా కాలనీ ప్రజలు , యువకుల మధ్య ఆనందోత్సవాల మద్య బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ప్రతిష్ట చెయ్యడం జరిగింది…ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం చేయాలని కాలనీ యువకులు సేవాస్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ను కోరడంతో సేవ స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున అన్నదానం కోసం 50 కిలోల బియ్యాన్నిమా వంతుగా సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మహనీయుని పండుగ రోజున అన్నదానం చేయడానికి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది ….ఈ కార్యక్రమంలో రేణికుంట్ల సురేష్ ,అరుముళ్ల ప్రభాకర,రాసపెళ్లి శ్రీనివాస్, సంగెం రాజు,వినయ్, తదితరులు పాల్గొన్నారు