ప్రయాణికుల కోసం చలివేంద్రం!.
ఉదారత చాటుకున్న ముస్త్యాల సర్పంచ్…
దర్వాజ:……అసలే ఎండాకాలం.. బయటకు వెళ్తే చాలు దాహం దాహం.. ఇంటికి వెళితేనే కానీ దాహం తీరలేని పరిస్థితి అలాంటిది ప్రయాణమై బయటికి వెళ్తున్నప్పుడు దాహార్తిని తీర్చుకోవాలంటే గగనమైన పరిస్థితి. సొంత మనుషులే ఇంటికి వెళ్తే కూడా నీళ్లు ఇవ్వని సమాజంలో బ్రతుకుతున్న కాలం…. కాగా తనకు సంబంధం లేకపోయినా ఓ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రయాణికుల మన్ననలు పొందుతున్నారు ఆ ఊరి సర్పంచ్…వివరాల్లోకి వెళితేపెద్దపెల్లి జిల్లా ,రామగిరి మండలం ముస్త్యాల గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య_నాగరాజు దంపతులు సోమవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.గోదావరిఖని నుండి మంథని కి వెళ్లే ప్రధాన మార్గంలో దారి పక్కన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అటువైపుగా వెళుతున్న ప్రయాణికులు దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత ఖర్చుతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ,ఈ దారి వెంబడి వెళ్లే ప్రయాణికులు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.