బ్రుటల్ మర్డర్!

మీ సేవ కేంద్రంలో పనిచేసే ఆపరేటర్ను అత్యంత కిరాతకంగా హత్యచేసి శరీర భాగాలను తెగనరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీపీసీ ఖాజీపల్లిలో ఉండే కాంపల్లి శంకర్ (35) గోదావరిఖనిలోని విఠల్ నగర్ మీసేవ కేంద్రంలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గురువారం సాయంత్రం నుంచి శంకర్ కనిపించకుండా పోయాడు. శుక్రవారం అతడి తల్లి పోచమ్మ పోలీసులకు ఫిర్యాదుచేసింది. మొండెం లేని శంకర్ తల భాగాన్ని శనివారం ఉదయం ఎన్టీపీసీ ప్లాంటు గోడ వద్ద గుర్తించారు. ఇతర శరీర భాగాల కోసం పోలీసులు గాలించారు. చివరకు నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడయ్యాయి. అతనువిచారించగా వివరాలు వెల్లడయ్యాయి. అతను ఇచ్చిన సమాచారం మేరకు తల నుంచి శరీరం వరకు ఉన్న భాగం ఒకచోట, మిగతా భాగాలను వేర్వేరుచోట్ల పడేసినట్లు గుర్తించి శనివారం రాత్రి వరకు స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడిని అతని భార్య, ఆమె బంధువులే హత్య చేశారంటూ శంకర్ తల్లి ఆరోపించింది………

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *