దరఖాస్తు దారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి…!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ తో కలిసి 1టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం నూతన భవనంను పరిశీలించారు…..
1టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఇంచార్జి డిసిపి అఖిల్ మహాజన్ …
అనంతరం పోలీస్ సిబ్బంది పని తీరు, ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.అలాగే నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏసిపి గిరిప్రసాద్ తెలిపారు. సిబ్బంది తో మాట్లాడి పోలీస్ స్టేషన్లో 5s ఇంప్లిమెంటేషన్ మరియు వర్టికల్స్ విధానాన్ని అమలు చేయాలని, బ్లూ కోట్ విధులు,పెట్రో కార్ యొక్క విధులు, పిటిషన్ మేనేజ్-మెంట్ మరియు పోలీస్ స్టేషన్ యొక్క పనితిరును రిసెప్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్రైమ్ వెహికల్స్, అబండెడ్ వెహికల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే వారితో మర్యాదగా మెలాగలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. అదేవిధంగా పాత నెరగాళ్లపై నిఘా ఉంచాలని, 100 డయల్ ఫిర్యాదుల పట్ల వేగవంతమైన స్పందన ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చెయ్యాలని అన్నారు. సైబర్ నేరాలపై రోడ్డు భద్రత నియమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు…..
కార్యక్రమంలో ఏసీపీ గిరి ప్రసాద్, సీఐలు గంగాధర రమేష్ బాబు , రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు నరేష్, సుబ్బారావు, స్వామి, శైలజ….. మరియు సిబ్బంది పాల్గొన్నారు…….