రామగుండం కార్పొరేషన్ లో అవినీతి అధికారులపై చర్యలు షురూ !
విచారణ జరిపిన అదనపు కలెక్టర్.
విజిలెన్స్ 15రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్ శాఖ ఆదేశం.
దర్వాజ: రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగం లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ విచారణ నివేదిక, విజిలెన్స్ విచారణ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టడానికి ఉపక్రమించింది. ఈమేరకు గతంలో పనిచేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ గుండ కిశోర్ కుమార్ పై అభియోగాలతో జీవో అర్టి 58 వెలువరించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ నుంచి సుదర్శన్ ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ హెల్త్ డిపార్ట్మెంట్లో మల్టీపర్పస్ హెల్త్ పనిచేసిన కిశోర్ కుమార్ డిప్యూటేషన్ రామగుండం నగరపాలక సంస్థలో శానిటరీ సూపర్వైజర్ గా పనిచేశారు. ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్ గా పని చేసిన కాలంలో డీజిల్ వినియోగం, వాహనాల రిపేర్లు, పండుగల పేర నకిలీ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు దండుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. పలువురు ఈ మేరకు అదనపు కలెక్టరు, విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఒక సీనియర్ కార్పొరేటర్ ఫిర్యాదుపై అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ విచారణ జరిపారు. విజిలెన్స్ విచారణలో కూడా. శానిటేషన్ విభాగంలో అవినీతి జరిగినట్టు గుర్తించారు. మూలనపడిన వాహనాలు నడిచాయంటూ లాగ్ బుక్ ల్లో నమోదు చేయడం, తప్పుడు డీజిల్ బిల్లులు, వాహ నాల రిపేరు పేర బిల్లులు, వివిధ కార్యక్రమాల పేర ఇష్టానురీతిలో ఓవర్ బిల్లులు, పండుగలపేర లక్షల్లో బిల్లులు, కొవిడ్ పేర వాహనాల బిల్లులపై విచారణలు జరి గాయి. లాగే బుక్‌లో తేడాలను గుర్తించారు. గుండా కిశోర్ కుమార్‌పై చర్యలు తీ సుకోవాలం టూ ఐఏఎస్ అధికారి అయిన అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుతా స్వానికి నివేదించారు. మరో వైపు విజిలెన్స్ శాఖ కూడా చర్యలకు నివేదించింది. ఈ నివేదికలను అనుసరించి చర్యలకు మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీచేసింది. 15 రోజు ల్లో అభియోగాలపై రాతపూర్వక వివరణ ఇవ్వా లని, రాజకీయ ఒత్తిళ్లుచేస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు కరీంనగర్ డీఎంహెచ్ ఓ కు ఆదేశాలు పంపారు. కాగా, శానిటరీ మాజీ అధికారి పై ఛార్జ్ నమోదు చేయడం మున్సిపల్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది……..