మెడికల్ వేస్ట్ బయటపడ్డ వేస్తే చర్యలు తప్పవు!
బయో మెడికల్ వేస్ట్ బయటపడ వేయకుండా ప్రత్యేక వాహనానికి అప్పగించాలని రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ బి.సుమన్ రావు కోరారు. సోమవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆసుపత్రుల నిర్వాహకులు,ఆర్ ఎం పి, పి ఎం పి వైద్యులతో సమావేశం నిర్వహించారు.
హనికారక వ్యర్థాలను మునిసిపల్ కార్మికులు ముట్టుకోవడం,వాటిని శాస్త్రీయ విధానంలో నాశనం చేయకపోవడం వలన ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున వీటిని సేకరించడానికి ఒక ఏజెన్సీ పని చేస్తుందని ఆయన తెలిపారు.ఈ ఏజన్సీ వారు బయో మెడికల్ వేస్ట్ సేకరించడానికి ఒక ప్రత్యేక వాహనంతో పాటు నిపుణులైన సిబ్బందిని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. వీరికి కొంత రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా బయో మెడికల్ వేస్ట్ బయట పడవేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.