జిడికె 11గని లో ప్రమాదం.
కార్మికుడికి తీవ్రగాయాలు…
రామగుండం 1, డివిజన్, జిడికె 11గని లో మంగళవారం తెల్లవారుజామున (సోమవారం నైట్ షిఫ్ట్) జరిగిన ప్రమాదంలో కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. నైట్ షిఫ్ట్ లొ కంటిన్యూస్ మైనర్ వన్ సీం, 79 లెవల్ లో మంగళవారం తెల్లవారుజాము సుమారు మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఎయిర్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాధం నుంచి నలుగురు కార్మికులు తప్పించుకున్నారు ..రవి అనే అనే ఫిట్టర్ కార్మికుడి తలకు బలమైన గాయాలు కాగా అధికారులు కార్మికులు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తీవ్ర గాయాలైన కార్మికుడు విధులు నిర్వహిస్తున్న దుస్తులు కాకుండా సివిల్ దుస్తులను మార్చి మరి ఆసుపత్రికి తరలించడం వెనుక అధికారుల తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకేనని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….గాయపడ్డ కార్మికుని హెచ్ ఎం ఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ ,సుద్దాల కుమారస్వామి పరామర్శించారు…