ధర్మాసుపత్రి లో అధర్మం!

షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన మూడు యంత్రాలు

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ పేషెంట్ లు రోజు నరకయాతన అనుభవిస్తున్నారని సిపిఐ నాయకులు మద్దెల దినేష్ డి హెచ్ పి ఎస్ నాయకులు …కందుకూరి రాజారత్నం…..శనివారం రోజున డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి రోగుల బాధలను తెలుసుకున్నారు మరియు ఆస్పత్రి సూపరిడెంట్ కంది శ్రీనివాస్ రెడ్డి ని కలిసి రోగులు పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్లారని వివరించారు.

అనంతరం మద్దెల, కందుకూరి రాజారత్నం … మాట్లాడుతూ ఆస్పత్రి ఆవరణలోనే విద్యుత్ తీగలుకు చెట్ల కొమ్మలు తగిలి షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయని దానివల్ల డయాలసిస్ సెంటర్ లో యంత్రాలు కాలిపోతున్నాయని దీనికి పూర్తి బాధ్యత విద్యుత్ అధికారులు వహించాలని, డయాలసిస్ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు ఇలాంటి నిర్లక్ష్యాన్నీ విడానాడాలని డిమాండ్ చేశారు. త్వరితగతంగా డయాలసిస్ యంత్రాలను ప్రత్యేక టెక్నిష్యన్స్ ను పిలిపించి మరమ్మత్తులు చేయించాలని పేర్కొన్నారు. ఒక వైపు సిపిఐ పక్షాన ఇంకో అయిదు కొత్త డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయాలని పైన ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని క్రిందికి దించాలని ఎన్నో రోజులుగా పోరాటం చేస్తూ అధికారులకు వివరిస్తూన్నామని గుర్తు చేసారు. అదే విధంగా ఒక వైపు రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా త్వరలో 61 డాయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్న తరణంలో మన ప్రాంతంలో నడుస్తున్న యంత్రాలు కలిపోవడం బాధాకరం ఇప్పటికైనా ఆస్పత్రి అభివృద్ధి కమిటి ఛైర్మెన్ స్పందించి ఇంకొ 5 కొత్త యంత్రాలు తెప్పించే ప్రయత్నం చేయాలని బుటకపు ప్రచారాలు మానుకోవాలని హితవు వారికి హితవు పలికారు. అదే విధంగా పెద్డపల్లి జిల్లా కేంద్రంలో మరియు మరియు మంథని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలలో నూతనంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి డయాలసిస్ రోగులను ఆదుకోవాలని సిపిఐ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *