క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
రామగుండం పోలీస్ కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్,ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ సెర్మొనల్ డ్రిల్ సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు. ఈ సందర్బంగా ఓఎస్డీ గారు మాట్లాడుతూ… వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్ నెస్, ఇతరసమస్యలు ఏమన్నా ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుంది. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న, డ్యూటీల వద్ద సమస్య ఉన్న, ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. చెడు అలవాట్లకు లోనుకాకూడదు అన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. అధికారుల యొక్క ప్రవర్తన, వారి వల్ల ఎలాంటి సమస్య ఉన్న చెప్పవచ్చు అన్నారు. క్రమశిక్షణతో డ్యూటీ లను నిర్వర్తించాలని, సిబ్బంది క్రమశిక్షణతో, మంచి ప్రవర్తనతో విదులు నిర్వర్తించినప్పుడు అదికారులు తమ వెంట ఉంటామన్నారు .సిబ్బందికి చేయవలసిన విధులు ,చేయకూడని పనుల గురించి పలు సూచనలు చేయడం జరిగింది. సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం. మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్ నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.ఈ పరేడ్ లో ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, ఆర్ ఐ లు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్, సీఐ లు ఎస్ఐ, ఆర్ఎస్ఐ లు హాజరు అయ్యారు.