ఉత్పత్తి లక్ష్య సాధనకు 47 రోజులు కీలకం!.

ప్రతీ రోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలి.

17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి.ఏరియా జీఎంలకు డైరెక్టర్ల ఆదేశం.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆర్జీ వన్ జీఎం నారాయణ………

దర్వాజ,హైదరాబాద్;…….సింగరేణి కాలరీస్ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన కోసం ప్రతీ రోజూ 2.3 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, ఇందుకోసం ఏరియా జీఎంలు ప్రణాళికాబద్ధంగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని సంస్థ డైరెక్టర్లు ఎన్.బలరామ్(ఫైనాన్స్, పర్సనల్) డి.సత్యనారాయణరావు(ఈ అండ్ ఎం), ఎన్.వి.కె.శ్రీనివాస్(ఆపరేషన్స్), జి.వెంకటేశ్వరరెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న 47 రోజుల్లో ప్రతీ నిమిషం అత్యంత కీలకమని, ప్రతీ షిఫ్టు వారీగా రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించడం ద్వారా ఈ ఏడాది సింగరేణి చరిత్రలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు, టర్నోవర్ ను సాధించవచ్చన్నారు. సంస్థ ఛైర్మన్ ,ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు సంస్థ డైరెక్టర్లు కొత్తగూడెం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. రోజుకు 2.30 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని డైరెక్టర్లు పేర్కొన్నారు. ఓవర్ బర్డెన్ తొలగింపు కాంట్రాక్టులు అన్ని సమకూర్చడం జరిగిందని, ఈ నేపథ్యంలో ఏరియాల వారీగా ప్రతీ జీఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లు, మేనేజర్లతో సమీక్షలు నిర్వహించుకొని రోజుకు 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తీసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలు చేరుకోవడం ద్వారా గనుల్లో బొగ్గు వెలికితీతకు అవకాశాలు మెరుగవుతాయన్నారు. బొగ్గు రవాణాకు కీలకమైన సీహెచ్పీల మెయింటెన్స్ను ఎ ప్ప టికప్పుడు పరిశీలించుకోవాలని, ఇబ్బందులు ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూమెంట్) జె.అల్విన్ మాట్లాడుతూ.. ఉత్పత్తితోపాటు నాణ్యతపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. అంతకుముందు సమీక్షా సమావేశానికి జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్ స్వాగతం పలుకుతూ.. ఏరియాల వారీగా ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఉత్పత్తి, రవాణా వివరాలను, మిగిలి ఉన్న 47 రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలను వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో . భూపాలపల్లి నుంచి అడ్వైజర్(మైనింగ్) డి.ఎన్. ప్రసాద్, జీఎం(సీపీపీ) సీహెచ్ నరసింహారావు, కార్పోరేట్ జీఎంలు, మరియు జనరల్ మేనేజర్ రామగుండం ఏరియా.1 కె. నారాయణ గారు అన్ని ఏరియాల జీఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు….

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *