24 గంటల పాటు నీళ్ళు -కేసిఆర్
పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా రూ.1,200 కోట్లతో నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పల్లె పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. పేదవారికి రూ.1 నల్లా కనెక్షన్ ఇస్తున్నామని.. రూ.5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.