టి.ఆర్.ఎస్ సైనికులు గెలుపే లక్ష్యంగా పని చేయాలి !
హుజూరాబాద్‌లో టి.ఆర్.ఎస్ గెలుపును సి.ఎం కేసీఆర్ కు కానుక ఇద్దామని రాష్ట్ర సంక్షేమ శాఖమాత్యులు కోప్పుల ఈశ్వర్ , రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ,పిలుపునిచ్చారు. అదివారం మున్సిపల్ పరిధిలోని 5వార్డులో ముఖ్య నాయకులతో మంత్రిగారు ఎమ్మెల్యే గారు సమావేశం నిర్వహించి దిశనిర్దేశం చేశారు… గులాబీ సైనికులంతా ఎన్నికల సంగ్రమంలో టి.ఆర్.ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగాపనిచేయాలన్నారు. కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర సి.ఎం కేసీఆర్ గారు అమలు చేసిన ప్రజాహితం సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకువెళ్లాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రజాహిత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి సిఎం కెసిఆర్ గారికి చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పై బి.జే.పీ చెస్తున్న అసత్య ప్రచారన్ని తెరాస శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసేలా టి.ఆర్.ఎస్ శ్రేణులు కృషి చేయాలన్నారు.