ఉత్తమ ఉపాధ్యాయునిగా పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ గుణాత్మక విద్య కోఆర్డినేటర్ గడ్డం జగదీశ్వర్..!
భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన్ని పురస్కరించుకొని లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ గుణాత్మక విద్య కోఆర్డినేటర్ గడ్డం జగదీశ్వర్ ఎంపికయ్యారు. ఈ నెల 18న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డును స్వీకరించాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. జగదీశ్వర్ గత 22 ఏళ్లుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విద్యా సేవలు అందిస్తున్నారు. 1998 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా చేరి గంభీరావుపేట, ఎలాబాక, సోమనపల్లి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోదావరిఖని, ఎన్ టి పి సి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుక్కల గూడూరు ఉన్నత పాఠశాల పని చేశారు . ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 19 వ డివిజన్ లోని నరసింహపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ జిల్లా గుణాత్మక విద్యా కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా సెక్టోరల్ అధికారిగా, జిల్లా గుణాత్మక విద్య కోఆర్డినేటర్ గా, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి గా బాధ్యతలు చేపట్టి విద్యా క్షేత్రంలో విశిష్టమైన కార్యక్రమాలను అమలు పరుస్తున్నారు… ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్న గడ్డం జగదీశ్వర్ ఈ అవార్డ్ కు ఎంపిక కావడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. కాగా తన ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడానికి సహకరించిన జిల్లా విద్యాశాఖ అధికారులకు trasma నాయకులకు జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.