రక్షణ ,ఉత్పత్తి సంస్థకు రెండు కళ్ళు!
ఉత్పత్తి మరియు ఉత్పాదకత పై (సి&ఎండి) శ్రీ ఎన్ . శ్రీధర్ ఐఏఎస్ . అన్ని ఏరియాల జియం లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించటం జరిగింది బుధవారం సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ . శ్రీధర్ ఐఏఎస్ గారు అన్ని ఏరియాల జియం లతో ఉత్పత్తి మరియు ఉత్పాదకత, నిర్థెశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించుటకు చేపట్ట వలసిన ప్రణాళికలు, మెరుగైన రక్షణ చర్యలకు ప్రణాళికలు , కార్మికుల ఆరోగ్యం , సంక్షేమంకు సంబందించి పలు విషయాల గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు . ఈ వీడియో కాన్ఫరెన్స్ లో (సి&ఎండి) ఎన్ . శ్రీధర్…. మాట్లాడుతూ ఈ సంవత్సరంకు గాను నిర్థెశించిన ఉత్పత్తి సాధించుటకు చేపట్టవలసిన ప్రణాళికలు , ఏరియాల వారీగా నిర్థెశించిన బొగ్గు ఉత్పత్తి మరియు ఉత్పాదకతకు లక్ష్యాల సాధనకు చేపట్ట వలసిన ప్రణాళికలు , నష్టాన్ని తీర్చుటకు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు, ఉపరితల గనులలో ఒవర్ బర్డెన్ తొలగింపు పనులు , ఒవర్ బర్డెన్ తొలగింపు కు సంబందించిన ఒప్పందాలు, వాటి స్థితి మరియు పని తీరు , నూతన (పాజేక్ట్ సంబందించిన చేపడుతున్న పనులు ఇందుకు సంబందించిన పనుల పురోగతి, ఉపరితల మరియు భూగర్బ గనులలో యం(తాల వినియోగం మరియు వాటి పనితీరు, గనులలో చేపడుతున్న రక్షణ చర్యలు, ఏరియా ల వారిగా కరోనా నివారణ చర్యలు , కార్మికుల ఆరోగ్యం స్థితి , ఏరియా లో చేపడుతున్న వ్యాక్సినేషన్ స్థితి మరియు కరోనా పరీక్షల స్థితి, ఏరియా కు సంబంచిన సంక్షేమ కార్యక్రమాలు మరియు ఏరియా లకు సంబందించిన ఇతర అంశాలపై అన్ని ఏరియా ల జియం లకు దిశానిర్థేశమ్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ జి 1 ఏరియా జియం కె . నారాయణ , మేడిపల్లి ఓపెన్ కాస్ట్ పి.ఓ సత్యనారాయణ .. పాల్గొన్నారు.