ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు..తండ్రి, కొడుకుపై కేసు నమోదు..
దర్వాజ: గోదావరిఖనిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రాంగ్పార్కింగ్ చేశారనే కారణంగా సోమవారం గోదావరిఖని లక్ష్మీనగర్లో ఒక ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ వాహనంలో ఎక్కి స్తుండగా వాహన యాజమాని, అతని కుమారుడు (13) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవలో వాహన యజమాని, అతని కుమారుడు విధుల్లో ఉన్న ఏఎస్ఐ అరిగొప్పుల వెంకటేష్ బాబు, మరో కానిస్టేబుల్ శ్రీనివాస్ ను దూషించారు. ట్రాఫిక్ ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి వాహన యజమాని, అతని కుమారు నిపై కేసునమోదు చేసినట్టు సీఐ రమేష్ బాబు తెలిపారు…….