నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నం..!
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ న్యూ పోరట్ పల్లి లో 30 లక్షల వ్యయం తో ఓపెన్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయనా మాట్లాడుతూ… గత వర్షాకాలంలో వర్షం నీటితో కాలువ నిండి ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రధానలక్ష్యంగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్యాల రామారావు, బుర్ర శంకర్ గౌడ్ వీరాలాల్ ఈదూనూరి శంకర్ కాలనీవాసులు పాల్గొన్నారు.